అధికారంలోకొస్తే ఆరు గ్యారంటీల అమలు : సింగపురం ఇందిర

స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌/ధర్మసాగర్‌‌‌‌, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ సింగపురం ఇందిర చెప్పారు. బుధవారం జనగామ జిల్లా స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ ముదిరాజ్‌‌‌‌ కాలనీలో, హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌‌‌‌ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను గెలిపిస్తే స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ను మోడల్‌‌‌‌ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తొమ్మిదేళ్లు గడిచినా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడం లేదన్నారు. అనంతరం పలువురు కాంగ్రెస్‌‌‌‌లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఘన్‌‌‌‌పూర్‌‌‌‌లో నీల శ్రీధర్‌‌‌‌, జూలకుంట్ల శిరీష్‌‌‌‌రెడ్డి, నీల వెంకటేశ్వర్లు, గోనెల ఉప్పలయ్య, ధర్మసాగర్‌‌‌‌లో గుర్రపు ప్రసాద్, కార్యదర్శి మహ్మద్‌‌‌‌ యాకూబ్‌‌‌‌ పాషా, డీసీసీబీ డైరెక్టర్‌‌‌‌ బొడ్డు లెనిన్‌‌‌‌ పాల్గొన్నారు.