బీఆర్‌‌ఎస్‌‌ను గద్దె దించాలి: సింగపురం ఇందిర

స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌, వెలుగు : బీఆర్‌‌ఎస్‌‌ను గద్దె దించేందుకు తెగించి కొట్లాడాలని కాంగ్రెస క్యాండిడేట్‌‌ సింగపురం ఇందిర పిలుపునిచ్చారు. బుధవారం ఘన్‌‌పూర్‌‌లో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ మాయమాటలు ప్రజలు నమ్మరన్నారు. భూములు అమ్మితే ప్రజలు ఊరుకున్నారని ఏకంగా ఉద్యోగ పరీక్ష ప్రశ్నాపత్రాలే అమ్ముకున్నారని ఆరోపించారు. 

కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంగా పనిచేసినా ఘన్‌‌పూర్‌‌కు ఒరిగిందేమీ లేదన్నారు. కాంగ్రెస్‌‌ విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. అంతకుముందు రాఘవాపూర్‌‌ నుంచి ర్యాలీగా ఘన్‌‌పూర్‌‌కు వచ్చి అంబేద్కర్‌‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.