పట్టుపట్టి గెలిచింది.. జులానా అసెంబ్లీ స్థానం వినేష్ ఫోగట్ కైవసం

పట్టుపట్టి గెలిచింది.. జులానా అసెంబ్లీ స్థానం వినేష్ ఫోగట్ కైవసం

హర్యానాలోని జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ విజయం సాధించారు. బీజేపీకి చెందిన ఒలింపియన్​ కెప్టెన్​ యోగేశ్​బైరాగి, ఆమ్​ ఆద్మీ పార్టీకి చెందిన మాజీ ఆర్మీ ఆఫీసర్​ను 6 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఆమె ఓడించారు.  ఇటీవల పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ ఫైనల్లో వినేశ్ అనర్హతకు గురైన విషయం తెలిసిందే. 

100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల అనంతరం ఆమె గత సెప్టెంబర్ 6న కాంగ్రెస్‌‌ పార్టీలో చేరారు. జులానా నుంచి అసెంబ్లీ బరిలో నిలిచారు. 

కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత వినేశ్ ​మీడియాతో మాట్లాడుతూ.. సత్యం గెలిచిందని పేర్కొన్నారు. ఇది ప్రజల పోరాటమని, అందులో వారే గెలిచారని, తాను వారి ప్రతినిధిని మాత్రమేనని పేర్కొన్నారు.