ప్రాణమున్నంత వరకు ప్రజాసేవ చేస్తా: సుదర్శన్ రెడ్డి

ఎడపల్లి, వెలుగు: ప్రాణమున్నంత వరకు బోధన్ నియోజకవర్గ ప్రజల పని చేస్తానని మాజీ మంత్రి, బోధన్​ కాంగ్రెస్​ అభ్యర్థి పి.సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎడపల్లిలో పార్టీ బూత్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుదర్శన్​రెడ్డి మాట్లాడుతూ..  పదేండ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమి లేదన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు గ్యారంటీ పథకాలను వివరించాలని కోరారు. 

పదేండ్ల నుంచి ప్రజలు పడుతున్న బాధలు తీరాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలన్నారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులు తనకు కొత్తేమీ కాదని, నియోజకవర్గ ప్రజల బాగోగులు చూసుకోవడమే ముఖ్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పులి శ్రీనివాస్, పార్టీ నాయకులు బిల్లా రామ్మోహన్, ఈరంటి లింగం, సాయికుమార్ రెడ్డి, కామప్ప, సూరిబాబు, స్వామిగౌడ్, బొబ్బిలి శ్రీనివాస్, అయుబ్​ఖాన్, నాయిని బలరాం, గంగాధర్, హన్మంత్​రెడ్డి, మోహన్ రెడ్డి, పోతన్న పాల్గొన్నారు.