- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతారెడ్డి
ఎల్ బీనగర్, వెలుగు : మల్కాజ్ గిరి లోక్ సభ సెగ్మెంట్ లో కాంగ్రెస్ దే గెలుపు అని ఆ పార్టీ అభ్యర్థి సునీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వనస్థలిపురంలో ఆదివారం కాంగ్రెస్ నేత ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ఇంటి వద్ద నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి 500 మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎక్కడ చూసినా కాంగ్రెస్కు ఆదరణ ఉందని, భారీ మెజారిటీతో కచ్చితంగా వస్తుందని చెప్పారు.
ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ కరీంనగర్ నుంచి పోటీ చేసి ఇక్కడకు రావడం ఆయనకు అక్కడి ఇక్కడి ప్రజలపై ఏ మాత్రం విశ్వాసముందో అర్థమవుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీజేపీ కోసం పని చేస్తున్నారని కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు జోగు రాములు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరగా రామ్మోహన్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.