ప్రభాకర్‌రావు ఎవరో కూడా నాకు తెలియదు
డబ్బులు ఇస్తేనే టికెట్ వచ్చిందనడం అవాస్తsవం
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ రాజేందర్‌రావు
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ బీజేపీ క్యాండిడేట్ బండి సంజయ్ ఓటమి భయంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ క్యాండిడేట్ వెలిచాల రాజేంద ర్‌రావు విమర్శించారు. కరీంనగర్‌లో తనకు ఇల్లు లేక అశోక్‌రావు ఇంట్లో ఉంటున్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. కరీంనగర్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావుతో తనకు సంబంధాలు ఉన్నాయని బండి సంజయ్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.
ప్రభాకర్‌రావు ఎవరో కూడా తనకు తెలియదని, తన స్నేహితుడి వియ్యంకుడైనంత మాత్రాన తనకు సంబంధం ఉన్నట్లు ఆరోపించడం సరికాదన్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నామినేషన్ పత్రాల కోసం తన భార్య మెడలోని పుస్తెలు అమ్ముకున్నానని చెప్పిన బండి సంజయ్.. పదేళ్లలో వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కరీంనగర్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు బండి సంజయ్ కారణమని, గ్రానైట్, ల్యాండ్ మాఫియా, కేబుల్ బ్రిడ్జి, స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ పనుల్లో ఎంత దోచుకున్నారో ప్రజలకు తెలుసన్నారు. అవినీతికి పాల్పడినందుకే బీజేపీ అధ్యక్ష పదవి పోయిందన్నారు.
తన కుటుంబానికి ఎలాంటి మచ్చ లేదన్నారు. సామాజిక సమీకరణాలతోనే తనకు టికెట్ వచ్చిందని, ఎక్కడో అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇస్తే తనకు సీటు వచ్చినట్టు బండి సంజయ్ మాట్లాడటం సరికాదన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణమ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, వైద్యుల అంజన్‌కుమార్, ఆకారపు భాస్కర్‌రెడ్డి, సుజిత్‌కుమార్, పులి అంజనేయులుగౌడ్ పాల్గొన్నారు.