- హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్
జమ్మికుంట, వెలుగు : ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ హుజూరాబాద్ అభ్యర్థి వొడితెల ప్రణవ్ ఆరోపించారు. మంగళవారం మాచనపల్లి, ఆబాదిజమ్మికుంట, పెద్దంపల్లి , జగ్గయ్యపల్లి, కేశవాపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు మంగళ హారతులు, డప్పుచప్పుల మధ్య స్వాగతం పలికారు. ప్రణవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ఉద్యమకారులను విస్మరించి ఉద్యమద్రోహులకు పట్టంకట్టారని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో బీఆర్ఎస్సర్కార్ పూర్తిగా ఫెయిలైందన్నారు.
ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణమైందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోసం కుట్రలు చేస్తున్నాయన్నారు. మీ బిడ్డగా తనను ఆశీర్వదించి ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం ఆబాదిజమ్మికుంట శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి, వెంకన్న, పూదరి రేణుక, సతీశ్‌రెడ్డి, సజ్జు, శివ, సలీం పాల్గొన్నారు.
ALSO READ : నేను చిటికేస్తే చాలు.. పోలీస్ అధికారికి అక్బరుద్దీన్ ఓపెన్ వార్నింగ్