- నల్గొండ, భువనగిరిలో స్పష్టంగా కనిపించిన క్రాస్ ఓటింగ్
- ఎన్నికల ఇన్చార్జి, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికి.. ఝలక్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యేలు
- సూర్యాపేటలోనూ కాంగ్రెస్ హవా
- భువనగిరిలో పారని బీసీ మంత్రం
నల్గొండ, వెలుగు : పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్ప్రభంజనం సృష్టించింది. నల్లొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. నల్గొండ, భువనగిరిలో బీఆర్ఎస్అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. రెండు చోట్ల ఎన్నికల ఇన్చార్జిగా పనిచేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యేలు ఝలక్ఇచ్చారు. నల్గొండ, భువనగిరిలో బీజేపీ రెండో ప్లేస్రావడానికి బీఆర్ఎస్వైఖరే కారణమని ఆ పార్టీలో చర్చ జరుగుతుంది.
ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీకి పోలైన ఓట్లను పరిశీలిస్తే అవన్నీ బీఆర్ఎస్ ఓట్లేనని తేలిపోయింది. నల్గొండలో సైదిరెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టడం వెనక బీఆర్ఎస్నేతల హస్తం ఉందని ముందు నుంచే ప్రచారం జరిగింది. ఇక భువనగిరిలో పాత శత్రువు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్అదే మంత్రాన్ని ప్రయోగించింది. గౌడ, కురమ్మ సామాజికవర్గాలు భువనగిరిలో బలంగా ఉన్నాయని క్యామ మల్లేశ్ ను రంగంలోకి దింపి చేతులు కాల్చుకుంది.
గులాబీ శ్రేణుల్లో నైరాశ్యం..
నల్గొండలో ఓడిపోతామనే కచ్చితమైన అభిప్రాయానికి వచ్చిన లీడర్లు పోలింగ్‌కు నాలుగైదు రోజుల ముందు నుంచే దుకాణం సర్దుకున్నారు. డబ్బులులేవని, ఖర్చు పెట్టినా ఫలితం దక్కదని తెలిసి వెనక్కి తగ్గారు. దీంతో ఎన్నికల ఇన్చార్జి జగదీశ్ రెడ్డి సైతం భువనగిరిలో అయినా పరువు కాపాడుకుందామని అటువైపు ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి బీఆర్ఎస్ ఓట్లు మళ్లీ కాంగ్రెస్‌కు పడితే తమ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని, కాబట్టి బీజేపీకి వేయాలని తెరవెనక ప్రచారం చేశారు. అర్బన్ఓటర్లు బీఆర్ఎస్ను ఆదరించే పరిస్థితి లేకపోవడంతో రూరల్ ఓటర్లను బీజేపీకి టర్న్అయ్యేలా ప్లాన్చేశారు. దీంతో రూరల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీ వైపు మళ్లడంతో ఆపార్టీకి ఓటు బ్యాంకు పెరిగింది.
బీజేపీకి పెరిగిన బలం..
కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జిల్లాలో తొలిసారిగా బీజేపీ రెండో ప్లేస్ సాధించడం ఒకరకంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని కలిగించింది. నల్గొండ పార్లమెంట్పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీజేపీకి 2,24,432 ఓట్లు పోలైతే, బీఆర్ఎస్కు 2,18,417 ఓట్లు పోలయ్యాయి. ఈ రెండింటి మధ్య ఓట్ల వ్యత్యాసం 6,015 ఉంది. ఇక భువనగిరిలో బీజేపీకి 4,06,973 ఓట్లు పోలుకాగా, బీఆర్ఎస్కు 2,56,187 ఓట్లు పోలయ్యాయి. సీపీఎంకు 28,730 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓట్ల వ్యత్యాసం 1,50,786 ఓట్లు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 11 సెగ్మెంట్లలో బీజేపీకి పోలైన ఓట్లు కేవలం 1,22,556 మాత్రమే. కానీ ఈ ఎన్నికల్లో రెండు ఎంపీ సెగ్మెంట్లలో కలిపి 6,31,405 ఓట్లు రావడం విశేషం.
అన్ని రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యం..
నల్గొండ ఎంపీ సెగ్మెంట్లో ఎన్నికల ఫలితాలు మొదటి రౌండ్‌నుంచి చివరి రౌండ్ కు కాంగ్రెస్ ఆధికత్య చాటుకుంది. మొత్తం 24 రౌండ్లలో ఓట్ల లె క్కింపు జరిగింది. పోస్టల్ బ్యాలెట్ మొదలు ఈవీఎంలో పోలైన ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి భారీ మెజార్టీ సాధించారు. అత్యధిక ఓట్లు హుజూర్ నగర్, కోదాడలో పోలయ్యాయి. మొదటి మూడు రౌండ్ల వరకు బీఆర్ఎస్లీడ్వచ్చింది.
కానీ నాలుగో రౌండ్ నుంచి బీజేపీ పుంజుకుంది. ఈ రెండింటి మధ్య పోలైన ఓట్ల వ్యత్యాసం స్వల్పంగానే ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్ బీఆర్ఎస్ను దెబ్బతీసింది. దీంతో మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, దేవరకొండలో బీజేపీకి భారీగా ఓట్లు పోలయ్యాయి. ఇదిలావుంటే మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సొం త నియోజకవర్గం సూర్యాపేటలో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఇక్కడ కేవలం బీఆర్ఎస్కు 33,953 ఓట్లు పోలైతే, కాంగ్రెస్‌కు 1,03,273 ఓట్లు పో లుకావడం విశేషం.