అమెరికాతో కలిసి పని చేయడానికి మేం సిద్ధం

అమెరికాతో కలిసి పని చేయడానికి మేం సిద్ధం
  • ట్రంప్‌కు కంగ్రాట్స్ చెప్పిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే 

న్యూఢిల్లీ: అమెరికా ప్రెసిండెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభినందనలు తెలియజేశారు. భారత్-, అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ట్రంప్‌తో  కలిసి పని చేయడానికి తాము రెడీగా ఉన్నామని ఎక్స్  వేదికగా వెల్లడించారు.

" అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌కు భారత జాతీయ కాంగ్రెస్ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్, అమెరికాలు సుదీర్ఘకాలంగా బలమైన, సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగిఉన్నాయి. ఇరు దేశాల ప్రజాస్వామ్య విలువలు, ఆసక్తుల ఆధారంగానే ఇది సాధ్యమైంది. ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు, ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం అమెరికాతో కలిసి పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం" అని ఖర్గే ట్వీట్ చేశారు.