ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆర్వో కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి నామినేషన్ పాత్రలను సమరపించారు షర్మిల. షర్మిలతో పాటు వివేకానందరెడ్డి కూతురు సునీత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసి రెడ్డి ఉన్నారు.
నామినేషన్ దాఖలు చేయటానికి ముందుగా షర్మిల ఆసక్తికర ట్వీట్ చేశారు. ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న సమయంలో మా దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైనవారి శుభాకాంక్షలు, అందుకొని విజయం వైపు ఈ అడుగు వేస్తున్నానని, నాన్న, బాబాయ్ ని మరిచిపోలేని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని, ధర్మం కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు షర్మిల. మరి, ఎన్నడూ లేని విధంగా కడప పార్లమెంట్ బరిలో నెలకొన్న హోరాహోరీ పోటీలో ఎవరిదీ పైచేయి అవుతుందో చూడాలి.