తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సీఈసీకి ఫిర్యాదు చేసింది. డబ్బులు తీసుకొని ఓటేయాలని కేటీఆర్ ప్రజలను ప్రలోభపెడుతున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత వేణుగోపాలస్వామి సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియామవళికి విరుద్ధంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని.. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఈసీని వేణుగోపాలస్వామి కోరారు. మూడు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే.. రిట్ పిటిషన్ వేస్తామని హెచ్చరించారు.
ALSO READ: సింగరేణి ఎన్నికలు : మరోసారి వాయిదా వేసిన హైకోర్టు
ఇటీవల ఓ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుడతూ.. కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలు డబ్బులు బాగా సంపాదించి, వాటితో ఓట్లు కొనాలనుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు డబ్బులిస్తే తీసుకోవాలని ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని ఓటర్లకు సూచించారు.