ఎల్​ఈడీ, సౌండ్​ సిస్టం టీఆర్​ఎస్​ వాడొచ్చు.. మేం వాడొద్దా?

ఎల్​ఈడీ, సౌండ్​ సిస్టం టీఆర్​ఎస్​ వాడొచ్చు.. మేం వాడొద్దా?
  • జీహెచ్​ఎంసీ ఆఫీసర్ల తీరుపై  ఎస్​ఈసీకి కాంగ్రెస్​ కంప్లయింట్​

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎన్నికల ప్రచారంలో ఎల్‌‌‌‌ఈడీ లైటింగ్, సౌండ్‌‌‌‌ సిస్టం కోసం తమకు జీహెచ్​ఎంసీ ఆఫీసర్లు పర్మిషన్​ ఇవ్వకుండా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు మాత్రం పరిష్మన్‌‌‌‌ ఇచ్చారని కాంగ్రెస్‌‌‌‌ అధికార ప్రతినిధి నిరంజన్‌‌‌‌ శనివారం రాత్రి ఎస్‌‌‌‌ఈసీకి కంప్లయింట్‌‌‌‌ చేశారు. తమ ప్రచార వాహనాల్లో ఎల్‌‌‌‌ఈడీ లైటింగ్, సౌండ్‌‌‌‌ సిస్టం ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం జీహెచ్‌‌‌‌ఎంసీ ఆఫీసర్లకు అప్లయ్​ చేసుకున్నామని ఫిర్యాదులో గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్‌‌‌‌ శనివారం రాత్రి కుత్బుల్లాపూర్‌‌‌‌లో నిర్వహించిన రోడ్డు షోలో ఎల్‌‌‌‌ఈడీ లైటింగ్​, సౌండ్​ సిస్టంను ప్రచారానికి ఉపయోగించారని కంప్లయింట్​లో ఆయన పేర్కొన్నారు.  ఇందుకు సంబంధించిన ఫొటోలను ఫిర్యాదుకు జత చేశారు. రాజకీయ పార్టీల మధ్య ఎలాంటి పక్షపాతం చూపకుండా తమకు కూడా అనుమతి ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.