గవర్నమెంట్ భూములను కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తనవాళ్లకు కట్టబెట్టిండు : కేకే మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

గవర్నమెంట్ భూములను కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తనవాళ్లకు కట్టబెట్టిండు : కేకే మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

ఎల్లారెడ్డిపేట, వెలుగు: సిరిసిల్లలోని ప్రభుత్వ భూములను కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తనవాళ్లకు కట్టబెట్టిండని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కేకే మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని 6వ వార్డు ఎస్సీ కాలనీలో ఆదివారం సీసీ రోడ్డు, గొల్లపల్లిలోని అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రం భవన నిర్మాణానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే సాబేరాబేగంతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. సిరిసిల్లలో తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఇష్టమొచ్చినట్లు సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములు అప్పగించిండని విమర్శించారు.

 ఏదైనా ఎంక్వైరీ చేద్దామంటే కోర్టుకెక్కుతాడన్నారు. ఆయనేమీ స్వాతిముత్యం కాదని ఎద్దేవా చేశారు. ఎల్లారెడ్డిపేట మండలానికి ఈజీఎస్ నిధులు  రూ.4.80 కోట్లు  మంజూరయ్యాయని వాటితో గ్రామాల్లో అభివృద్ధి పనులు మొదలుపెట్టాలని సూచించారు.  తాను ఈ ప్రాంత బిడ్డనని, ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటానన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాంరెడ్డి, డైరెక్టర్లు, లీడర్లు పాల్గొన్నారు.