రాజ్యాంగం జోలికి రావొద్దు : పూజల హరికృష్ణ

రాజ్యాంగం జోలికి రావొద్దు : పూజల హరికృష్ణ
  • కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి హరికృష్ణ 

సిద్దిపేట రూరల్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం జోలికి రావొద్దని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణ అన్నారు. గురువారం కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జై భీమ్ జై బాపు జై సంవిధాన్ నినాదంతో సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామం నుంచి పాదయాత్ర నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దళితులకు, మైనార్టీలకు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు సమన్యాయాన్ని పొందారని, బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బుచ్చిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మందపాండు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ, మాజీ సర్పంచులు సదాశివరెడ్డి, దేవయ్య, సీనియర్ నాయకులు మహేందర్, మండల అధ్యక్షుడు రాములు, అంజిరెడ్డి, అత్తు ఇమామ్, అంజయ్య, సతీశ్, భిక్షపతి, కవిత పాల్గొన్నారు.