- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణ
సిద్దిపేట రూరల్, వెలుగు: సంక్షేమ హాస్టళ్లపై బీఆర్ఎస్ ఆరోపణలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ అన్నారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లిలోని గురుకుల రెసిడెన్షియల్ హాస్టల్ ను ఆయన సందర్శించి స్టూడెంట్స్తో మాట్లాడారు. భోజన వసతులు, కిచెన్ రూమ్ ను సందర్శించి మౌలిక వసతులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ గురుకుల హాస్టళ్లలో స్టూడెంట్స్తమ ఇళ్లలో ఉన్నట్టుగానే ఉంటున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.
అధికారం కోల్పోగానే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. సంక్షేమ హాస్టళ్లలో డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సమావేశం లో ప్రిన్సిపాల్ విష్ణు వర్ధన్ రెడ్డి, తహసీల్దార్సలీం, నాయకులు కాలీముద్దీన్, యాదగిరి, గోపి కృష్ణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పాండు, రూరల్ అధ్యక్షుడు అంజి రెడ్డి, భిక్షపతి, సత్యనారాయణ, కర్ణాకర్, బాబీశ్, అజమాత్, వనజ, కవిత పాల్గొన్నారు.