- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వొడితెల ప్రణవ్ సవాల్
హుజూరాబాద్ రూరల్, వెలుగు: సీఎం, మంత్రుల మీద ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి.. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ సవాల్ విసిరారు. శనివారం హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ మెప్పు కోసమే సీఎం, మంత్రులు, కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించారు.
కౌశిక్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్ స్టార్ అని, ప్రజలను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసి గెలిచాడన్నారు. ఇప్పటికైనా ఆయనకు దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్‌విసిరారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు హుజూరాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గం నియమించకుండా అన్యాయం చేశాడన్నారు. పూర్తిస్థాయిలో దళితబంధు ఇవ్వకుండా దళితులను కేవలం ఓట్ల కోసమే వాడుకున్నాడని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రూ.10 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.