పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వివిధ పనుల్లో అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపించారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అవినీతి తప్పా.. అభివృద్ధి జరగలేదని జూన్ 22న జరిగిన కార్పొరేషన్ సమావేశాన్ని కాంగ్రెస్ కార్పొరేటర్లు బహిష్కరించి ఆందోళనకు దిగారు. కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేవంటూ మేయర్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
అదే సమయంలో వచ్చిన మేయర్ అనిల్‌కుమార్.. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నప్పుడు నిరసనలు తెలపడం సరికాదని అంటూ కార్పొరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఎఫ్‌సీఐ ఎక్స్‌రోడ్డు నుంచి ఎన్టీపీసీ రింగు రోడ్డు వరకు రోడ్డు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు, వివిధ పెండింగ్పనుల మోక్షమెన్నడు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ కార్పొరేటర్లు కార్పొరేషన్ ఆవరణలో కూర్చుని ఆందోళన నిర్వహించారు.