హుజూర్ నగర్లో వైస్ చైర్మన్పై నెగ్గిన అవిశ్వాసం

హుజూర్ నగర్: సూర్యపేట జిల్లాలో మరో బల్దియా పదవిని కాంగ్రెస్​ కైవసం చేసుకోనుంది. హుజుర్ నగర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావుపై కాంగ్రెస్ కౌన్సిలర్ లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో నాగేశ్వరరావు తన పదవి కోల్పోయారు. అవిశ్వాస తీర్మాన సమావేశానికి 28 మంది కౌన్సిలర్లకు గాను 24 మంది సభ్యులు హాజరయ్యారు.

వారిలో22 మంది సభ్యులు అనుకూలంగా, ఇద్దరు సభ్యులు వ్యతిరేకంగా చేతులు లేపి తమ మద్దతు తెలిపారు. కాగా ఎన్నికకు  నాగేశ్వరరావు గైర్హాజరయ్యారు. సమావేశానికి ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి  ఆఫీసర్ గా వ్యవహరించారు.