- అధికారం పోయినా అహంకారం తగ్గలేదని కామెంట్
- రాజీవ్ గాంధీని ప్రశంసిస్తూ కేసీఆర్ మాట్లాడిన వీడియో రిలీజ్చేసి కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ఎదుట ఏర్పాటు చేయడాన్ని తప్పుపడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ మండిపడింది. రాజీవ్‌గాంధీపై కేటీఆర్‌వి చిల్లర మాటలని, ఆయన అహంకారానికి నిదర్శనమని ఫైర్ అయ్యింది.
గతంలో రాజీవ్ గాంధీని ప్రశంసిస్తూ కేసీఆర్ మాట్లాడిన ఓ వీడియోను కేటీఆర్‌కు కౌంటర్అటాక్గా మీడియాకు సోమవారం రిలీజ్ చేసింది. హైదరాబాద్ లో సైబర్ టవర్ ఏర్పాటు, ఐటీ సంస్థల విస్తరణకు అప్పటి ప్రధాని, సీఎంలైన రాజీవ్ గాంధీ, ఎన్. జనార్దన్‌రెడ్డి కారణమని, నగర అభివృద్ధిలో వారి పాత్ర ప్రశంసనీయమని కేసీఆర్ ఆ వీడియోలో ప్రస్తావించారు.
కేటీఆర్‌కు సంస్కారం లేదు: మధుయాష్కీ
దేశానికి సేవలందించిన రాజీవ్‌గాంధీ పై కేటీఆర్ చిల్లర మాటలు మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని మాజీ ఎంపీ మధు యాష్కీ ఒక ప్రకటనలో మండిపడ్డారు. దేశానికి ప్రధానిగా సేవలందించిన నేతల విగ్రహాలను ఎక్కడైనా పెట్టుకొని, గౌరవించుకోవచ్చని చెప్పారు. ఆ సోయి, సంస్కారం కేటీఆర్ కు లేదని ఫైర్ అయ్యారు.
అధికారం పోయినా కేటీఆర్ లో అహంకారం తగ్గలేదని ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నేత గురించి మాట్లాడే నైతికత కేటీఆర్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. సెక్రటేరియెట్లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ము కేటీఆర్ కు ఉందా? అని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు.