హర్యానా, J&K రిజల్ట్ : దూసుకెళ్తున్న ఇండియా కూటమి

హర్యానా, J&K రిజల్ట్ : దూసుకెళ్తున్న ఇండియా కూటమి

హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ లో ఇండియా కూటమి దూసుకెళ్తోంది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 50 సీట్లకుపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఇక అధికార బీజేపీ పార్టీ  కేవలం 15స్థానాల్లోనే లీడ్ లో ఉంది.ఇక జేజేపీ, ఐఎన్ఎల్డీ పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం అయ్యాయి. జమ్మూకశ్మీర్లోనూ ఎన్సీ, కాంగ్రెస్ కూటమి అత్యధికంగా  30కిపైగా స్థానాల్లో లీడ్ లో ఉండగా.. 26సెగ్మెంట్లలో అధిక్యంలో బీజేపీ నిలిచింది. 

ALSO READ : హర్యానా,జమ్మూకశ్మీర్ ఓట్ల లెక్కింపు: ఆధిక్యంలో కాంగ్రెస్

ఇక ముప్తీ మహమ్మద్ నేతృత్వంలోని పీడీపీ మూడు  స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక హర్యానాలో మాజీ సీఎం భూపిందర్ హుడా, రెజ్లర్, వినేశ్ ఫోగట్ ముందంజలో కొనసాగుతున్నారు. జమ్మూకశ్మీర్లో ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా గండేర్ బల్ స్థానంలో లీడింగ్ లో ఉన్నారు. ఇక ఫలితాల్లో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వస్తుండటంతో ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో సంబురాలు చేసుకుంటన్నారు పార్టీ శ్రేణులు.