
పటాన్చెరు, వెలుగు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు దళితులను కించపరిచేవిధంగా ఉప ముఖ్యమంత్రిని కుక్క తోకతో పోల్చడం దుహంకారానికి ప్రతీక అని పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి హరీశ్‌రావుపై పటాన్చెరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇటీవల హరీశ్ రావు ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రిని కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదన్నారు.
కుక్క తోకనాడిస్తుందా, తోక కుక్కనాడిస్తుందా అంటూ దళిత ఉప ముఖ్యమంత్రిని కించపర్చాడన్నారు. అహంకార పూరితంగా వ్యాఖ్యలు చేసిన హరీశ్ రావుపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డెరైక్టర్ అతిక్, పట్టణ ఉపాధ్యక్షుడు యువరాజ్, అశోక్, సాయిలు, జాన్సన్, అక్షిత్ పాల్గొన్నారు.