వైసీపీ నేతను అరెస్ట్ చేయండి

పోలీసులకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు  

మెహిదీపట్నం, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ ఆర్ సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.  గురువారం కార్వాన్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షుడు కురాకుల కృష్ణ ఆధ్వర్యంలో లంగర్ హౌస్, కుల్సుంపురా, టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

అనంతరం కాంగ్రెస్ నేతలు లంగర్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ సిటీ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ వినోద్ సింగ్, జియాగూడ డివిజన్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గార్జె కిషన్, హబీబ్, కార్వాన్ బి బ్లాక్ మహిళా ప్రెసిడెంట్ షకీలా, హేమలత, శ్యామల ఉన్నారు.