మున్సిపల్ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్

​ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మున్సిపల్ సమస్యలను పరిష్కరించాలని, అవినీతి అక్రమాలపై విచారణ చేయించాలని కోరుతూ కాంగ్రెస్ లీడర్లు సోమవారం కమిషనర్ ​ప్రసాద్ చౌహాన్​ కు మెమోరండం అందజేశారు.  కాంగ్రెస్ పీసీసీ ప్రచార కమిటీ మెంబర్ కోలా వెంకటేశ్, టౌన్ ​ప్రెసిడెంట్​సాయిబాబాగౌడ్ మాట్లాడారు. ఆర్మూర్ మున్సిపల్ లో అక్రమంగా కేటాయించిన ఇంటి నెంబర్లపై విచారణ చేయాలని, అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. హరితహారం మొక్కల పెంపకంలో నిధుల దుర్వినియోగమయ్యాయని దీనిపై విచారణ చేపట్టాలన్నారు. 

కోతులు, కుక్కల బెడద పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. అర్హులకు పింఛన్లు మంజూరు చేయడంలో జాప్యం చేస్తూ అనర్హులకు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. గణేశ్​ శోభాయాత్ర జరిగే రోడ్లను బాగు చేయాలని, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.  కార్యక్రమంలో లీడర్లు మీర్ మాజీద్, జిమ్మి రవి, రవికాంత్ రెడ్డి, బాల కిషన్, అబ్దుల్ ఫయీమ్,పెద్ద పోశెట్టి, హబీబ్, ప్రసాద్, ఉదయ్, అలీమ్, భగత్, అఖిల్ పాల్గొన్నారు.