బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ను బర్తరఫ్‌‌‌‌‌‌‌‌ చేయాలి

బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ను బర్తరఫ్‌‌‌‌‌‌‌‌ చేయాలి

కరీంనగర్ సిటీ/జగిత్యాల రూరల్‌‌‌‌‌‌‌‌/ జమ్మికుంట/ మల్యాల/బోయినిపల్లి/సిరిసిల్ల టౌన్/ వెలుగు: ప్రజాగాయకుడు గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు డిమాండ్ చేశారు. బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యలకు నిరసనగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జిల్లాకేంద్రాలు, మండలకేంద్రాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పలు చోట్ల బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ దిష్టిబొమ్మ దహనం చేశారు.

గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్‌‌‌‌‌‌‌‌కు లేదని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్‌‌‌‌‌‌‌‌రావు విమర్శించారు. జగిత్యాల తహసీల్‌‌‌‌‌‌‌‌ చౌరస్తాలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంజయ్‌‌‌‌‌‌‌‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. సిరిసిల్లలో మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు మీడియాతో మాట్లాడుతూ గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.