మంథని, వెలుగు: దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని ఆరోపిస్తూ మంథనిలో శుక్రవారం కాంగ్రెస్ లీడర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బంధును బీఆర్ఎస్ లీడర్లకే ఇచ్చారన్నారు. మంథనిలో నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్‌కు దళితబంధు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు.
అర్హులకు దళితబంధు ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ అంబేద్కర్ చౌరస్తా నుంచి మంథని ఆర్డీవో ఆఫీసు వరకు ర్యాలీ తీశారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజు, లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.