
హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా నేతలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నిర్ణయాన్ని కాదని రెబల్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి సంజీవ్ రెడ్డి, ఆయనకు సహకరిస్తున్న ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, భార్గవ్ దేశ్‌పాండేలను పార్టీ నుంచి బహిష్కరించింది. ఈమేరకు శుక్రవారం పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల పార్టీలో చేరిన ఎన్నారై కంది శ్రీనివాస్ రెడ్డికి ఆదిలాబాద్ టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సంజీవ్ రెడ్డి.. ఆదిలాబాద్‌లో
రెబల్‌గా నామినేషన్ వేశారు.