జగిత్యాల టౌన్, వెలుగు: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్‌లతో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి అన్నారు. జగిత్యాలలోని ఇందిరా భవన్ లో గురువారం మహిళా కాంగ్రెస్ సభ్యులకు గ్యారంటీ స్కీమ్‌లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్కీమ్‌ల పోస్టర్లను ఆవిష్కరించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్‌ను అధికారంలోకి రానివ్వకుండా చీకటి ఒప్పందం చేసుకున్నాయని, ఈ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో మహిళా లీడర్లు మాధవి, సంధ్య, రమ్య, సహరా అంజూమ్, మమత, సరిత పాల్గొన్నారు.