కాంగ్రెస్‌‌‌‌కు రైతులపై పట్టింపు లేదు మాజీమంత్రి, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధ్యయన కమిటీ చైర్మన్‌‌‌‌ నిరంజన్‌‌‌‌రెడ్డి

కాంగ్రెస్‌‌‌‌కు రైతులపై పట్టింపు లేదు మాజీమంత్రి, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధ్యయన కమిటీ చైర్మన్‌‌‌‌ నిరంజన్‌‌‌‌రెడ్డి

ఆదిలాబాద్‌‌‌‌టౌన్, వెలుగు : ‘రైతులందరికీ రుణమాఫీ చేశామని కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది.. క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి, సగానికిపైగా రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు’ అని మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధ్యయన కమిటీ చైర్మన్‌‌‌‌ నిరంజన్‌‌‌‌రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్‌‌‌‌ పట్టణంలోని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ ఆఫీస్‌‌‌‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి కాంట్రాక్టుల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని విమర్శించారు. 

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదని,  ప్రభుత్వ అసమర్థత కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ విధానాలపై బీజేపీ ఎందుకు మౌనం వహిస్తుందని,  కాంగ్రెస్‌‌‌‌కు బీజేపీ ఉపసైన్యంలా పని చేస్తుందా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకపోతే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

కార్యక్రమంలో అధ్యయన కమిటీ సభ్యులు, మాజీమంత్రులు జోగు రామన్న, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, అంజయ్యయాదవ్‌‌‌‌ పాల్గొన్నారు.