హర్యానాలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. హర్యానాతో పాటు జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇటీవలే రిలీజ్ చేసింది ఈసీ. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హర్యానాలో ఉన్న 10లోక్ సభ స్థానాలకు గాను బీజేపీ, కాంగ్రెస్ చెరో 5స్థానాల్లో గెలుపొందిన క్రమంలో అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఒక ఆసక్తికర సర్వే వెలువడింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హర్యానాలో బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ లోక్ సభ స్థానాలొస్తాయని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలింది.
మూడ్ ఆఫ్ ది నేషన్ విడుదల చేసిన సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.... ఓట్ షేర్ పరంగా.. ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య గట్టి పోటీ ఉంటుందని తేలింది. ఇండియా కూటమికి 2024 ఎన్నికల్లో 47.61 శాతం ఓట్లు రాగా.. ప్రస్తుతం 45.8 శాతం ఓట్లను గెలుచుకునే అవకాశం ఉందని తేలింది. ఇక ఎన్డీయే కూటమికి గత ఎన్నికల్లో 46.11 శతం ఓట్లు పోల్ అవ్వగా ప్రస్తుతం స్వల్పంగా తగ్గి 44.2 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందని తేలింది.
Also Read:-ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీ
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 6 లోక్ సభ స్థానాలు, బీజేపీ 4 లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. ఇక ఆమ్ ఆద్మీ, జన్నాయక్ జనతా పార్టీ వంటి పార్టీలు ఖాతా కూడా తెరవలేని పరిస్థితి ఉంటుందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలింది.