కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం : తూముకుంట నర్సారెడ్డి

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం : తూముకుంట నర్సారెడ్డి

ములుగు, వెలుగు: కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గురువారం ములుగులోని ఎస్సీ కాలనీలో పోచమ్మ ఆలయం వద్ద రూ.7 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు  వచ్చి నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని లేదంటే రాజీనామా చేయాలన్నారు.

 కార్యక్రమంలో జిల్లా మాజీ కో ఆప్షన్ సభ్యుడు సలీం, నియోజకవర్గ యువజన మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మల శ్రీనివాస్, కడపల నరసింహారెడ్డి, ప్రభాకర్ గుప్తా, ములుగు మండల యువజన అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, ములుగు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండు నర్సింలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మహంకాళి, రాములు, ఐలయ్య, స్వదేశ్, బుడిగె సంజీవులు పాల్గొన్నారు.