
మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకులు అరికెల నర్సారెడ్డి ఈరోజు టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో అరికెల టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలోనే తన అనుచరులను, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను టీఆర్ఎస్ లో చేర్పించేందుకు స్థానికంగా భారీ ఎత్తున ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా అరికెల నర్సారెడ్డి తెలిపారు. అరికెల చేరిక పట్ల హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్, ఆయనకు పార్టీ సముచిత గౌరవం కల్పిస్తుందని తెలిపారు.