
తూర్పు గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీఎంపీ హర్షకుమార్ సంచలన కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడేవారుంటే దేశం విడిచి వెళ్లాలలన్నారు. తాము కూడా అదే చెబుతున్నామని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. పవన్ కు ఎంత దేశ భక్తి ఉందో కాంగ్రెస్ కు.. మాకు అదే దేశభక్తి ఉందన్నారు హర్షకుమార్.
పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత మొదట ప్రధాని, హోం మినిస్టర్ వెళ్లారు. మూడో వ్యక్తి రాహుల్ గాంధీ వెళ్లారు. అదే రోజు హైదరాబాద్ లో భారత్ సమిట్ ప్రోగ్రామ్ ఉంటే అది క్యాన్సిల్ చేసుకుని పహల్ గాం బాధితులను రాహుల్ పరామర్శించారని తెలిపారు. ఎవరైనా పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే కచ్చితంగా అరెస్టు చేసి శిక్షించాలన్నారు.ఇంత వరకు పవన్ కళ్యాణ్ పహల్గాం వెళ్లలేదు, పవన్ హిందుత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్, అనురాగ్ ఠాగూర్ ఇద్దరు ఒకే రకంగా మాట్లాడుతున్నారు.
పవన్ కళ్యాణ్ పహల్గాం మృతులకు జనసేన 23, 24, 25 మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. ఈ నెల 25న పిఠాపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. అసలు పవన్ కు దేశ భక్తి ఉందా... పహల్గాం మృతుల పట్ల నిజమైన ప్రేమ ఉందా... అంతా ఆర్భటమేనా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి .. సంతాప దినాలు అని ప్రకటించి.. అభివృద్ది కార్యక్రమాల్లో ఎలాపాల్టొన్నారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ను విమర్శించే ముందు మీరేంటో ఆలోచించుకోవాలంటూ.. ఇండియాలో ఉన్న ముస్లింలు వేరు... పాకిస్తాన్ లో ఉన్న ముస్లింలే వేరు అని అన్నారు
ఇండియాలో ముస్లింలకు దేశం పట్ల ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. హిందువులని కాల్చేసారని పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు.
ఉపముఖ్యమంత్రిగా ఉండి భావోద్వేగాలు రెచ్చగొట్టే సమయామా ఇది అని ప్రశ్నించారు హర్షకుమార్ .జనసేన జెండా చూస్తే క్రిస్టియన్ కంట్రీ ఇజ్రాయిల్ దేశపు జెండా రంగు మార్చి పెట్టుకున్నారని.. ఇజ్రాయిల్ జెండా బ్లూ, జనసేన జెండా రెడ్ కలర్ లో కాఫీ కొట్టారన్నారు. పవన్ మొదటి సారి పోటీ చేసినప్పుడు చర్చికెళ్లారు, బాప్టిజం తీసుకున్నారు... మయావతి కాళ్లపై పడ్డారు..
ఇప్పుడు సనాతన ధర్మం, లడ్డూపై వివాదం, ఎంత చేసిన బిజెపి పాక సత్యనారాయణను ఎంపీ చేసిందన్నారు.పవన్ కళ్యాణ్ రెచ్చిపోకండి బిజెపి మిమ్మల్ని దూరం పెట్టింది...బిజెపిని మీరు ఓన్ చేసుకోవాలనుకున్నా బిజెపి మిమ్మల్ని దూరం పెట్టింది.మీ అన్న నాగబాబుకు ఎమ్మెల్సీతో సరిపెట్టి బిజెపి కార్యకర్తకు ఎంపీ టికెట్ ఇచ్చింది. దీన్ని బట్టి బిజెపి మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచిందన్నారు. ప్రవీణ్ పగడాల హత్యా, అత్మహత్యా అనే విషయాన్ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ స్పష్టం చేయాలన్నారు.