దేశానికి స్వాతంత్య్ర తేవడంలో కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఏడో రోజు పాదయాత్ర చేపట్టిన ఆయన..కరీంనగర్ జిల్లా అలుగునూర్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..బండి సంజయ్ పాదయాత్ర ఒక విలాసవంతమైన విహారయాత్ర అని విమర్శించారు. కేసీఆర్ స్పాన్సర్షిప్తో బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడని ఆరోపించారు.
దేశంలో కాంగ్రెస్ బలపడుతోంది కాబట్టే రాష్ట్రంలో బీజేపీని బలపరిచేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ను కొట్టడమే కేసీఆర్ లక్ష్యమని మండిపడ్డారు. ఎంపీ అయిన మూడేళ్లలో బండి సంజయ్ ఏంచేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. గుండాయిజం చేస్తానంటూ బండి అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బండి సంజయ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని అన్నారు.