మిర్యాలగూడ, వెలుగు: కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా మిర్యాలగూడ, వైరా స్థానాలు సీపీఎంకు ఇవ్వాలని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. సోమవారం మిర్యాలగూడ సీపీఎం ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎం, సీపీఐ కలిసి 119 స్థానాల్లో పది స్థానాలను కోరగా.. నాలుగు స్థానాలకు ఒప్పందం కుదిరిందన్నారు. ఇందులో సీపీఎంకు మిర్యాలగూడ, వైరా సీట్లు ఇస్తే మిగిలిన 115 స్థానాల్లో సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు.
తమకు కేటాయించిన సీట్లలోనూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూర్తిగా మద్దతు తెలపాలని కోరారు. ఈ మేరకు ఎవరూ రెబల్‌గా పోటీ చేయకుండా కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకోవాలన్నారు. ఇలా అయితేనే బీఆర్‌ఎస్‌ను గద్దె దించడం సాధ్యమన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, జిల్లా నాయకులు వీరపల్లి వెంకటేశ్వర్లు, గిరిజన సంఘ రాష్ట్ర నాయకులు రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, భావండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రామ్మూర్తి, వరలక్ష్మి, పరశురాములు, వినోద్ నాయక్, శశిధర్ రెడ్డి, రొండి శ్రీనివాస్, రాంచంద్రు, దేశిరం నాయక్, పాల్వాయి రాంరెడ్డి, గోవింద్ రెడ్డి, ఏసు, వెనుధర్ రెడ్డి, సైదులు పాల్గొన్నారు.