సీఎం దిష్టిబొమ్మ దహనంపై కాంగ్రెస్​ ఫైర్

సీఎం దిష్టిబొమ్మ దహనంపై కాంగ్రెస్​ ఫైర్

జైపూర్, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని జైపూర్​ మండల కాంగ్రెస్ లీడర్లు తీవ్రంగా ఖండించారు. బుధవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ రిక్కుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజోద్దిన్ మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయని, ఆ పార్టీల లీడర్లు ఎన్నికల కోడ్​ను ఉల్లంఘించి మండల కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేయడంపై మండిపడ్డారు.

కాంగ్రెస్ ​ప్రభుత్వం ప్రజలు, రైతుల పక్షాన నిలుస్తోందన్నారు. బీఆర్ఎస్ లీడర్లు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చిందో చెప్పాలన్నారు. రైతులను బీఆర్ఎస్ మోసం చేసిందని ఫైర్​అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచులు లింగారెడ్డి, గణేశ్, నాయకులు మంతెన లక్ష్మణ్, పాపిరెడ్డి, వెంకటేశ్, నాగరాజు, మారుతి, ప్రశాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.