ఇవాళ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ జెండా ఎగుర వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కాంగ్రెస్ ఇన్ టెర్మ్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ పార్టీ జెండాను ఎగుర వేస్తుండగా ఓ షాకింగ్ ఘటన జరిగింది. జెండా ఎగురవేసే తాడు చిక్కుకుపోయింది. దీంతో అక్కడున్న సిబ్బంది వచ్చి.. జెండాను బలంగా లాగే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా పైన ఎగరాల్సిన కాంగ్రెస్ పార్టీ జెండా ఊడి వచ్చి సోనియా గాంధీ చేతుల్లో పడింది. దీంతో ఆ జెండా చూసిన సోనియా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ తర్వాత చేతులతో పార్టీ జెండాను పట్టుకున్నారు. అయితే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో అనుకోకుండా జరిగిన ఈ పరిణామం చూసి అక్కడున్న వారంతా తెల్లమోహం వేశారు.
#WATCH | Congress flag falls off while being hoisted by party's interim president Sonia Gandhi on the party's 137th Foundation Day#Delhi pic.twitter.com/A03JkKS5aC
— ANI (@ANI) December 28, 2021
ఇవి కూడా చదవండి:
21 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్