- ఉమ్మడి జిల్లాలో రాజ్‌ఠాకూర్‌దే అత్యధిక మెజార్జీ
- పార్టీ గెలుపుతో శ్రేణుల్లో జోష్
గోదావరిఖని, వెలుగు : రామగుండంలో 29 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరింది. తాజా ఎన్నికల్లో ఈ నియోజకర్గం నుంచి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ విజయం సాధించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. మేడారం (ఎస్‌సీ) నియోజకవర్గంగా రామగుండం, వెల్గటూర్, ధర్మారం, ఇతర మండలాలు ఉండేవి. రామగుండం ప్రాంతం నుంచే 1967, 78లో కాంగ్రెస్ నుంచి జి.రాములు, 1972లో జి.ఈశ్వర్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. 1983లో మాతంగి నర్సయ్య(ఇండిపెండెంట్) గెలిచి కాంగ్రెస్‌లో చేరారు. 1985లో టీడీపీ ప్రభంజనంలో సింగరేణి కార్మికుడు మాలెం మల్లేశం విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి మాతంగి నర్సయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇక అప్పటి నుంచి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థులెవరు గెలవలేదు. అనంతరం 1994లో ఇండిపెండెంట్‌గా మాలెం మల్లేశం, 1999లో మాతంగి నర్సయ్య(టీడీపీ), 2004లో కొప్పుల ఈశ్వర్(బీఆర్‌ఎస్) ఎమ్మెల్యేలయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో రామగుండం జనరల్‌గా మారింది. ఆ ఏడాది ఎన్నికల్లో సోమారపు సత్యనారాయణ ఇండిపెండెంట్‌గా, 2014లో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. 2018లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కోరుకంటి చందర్ విజయం సాధించారు.
అత్యధిక మెజార్టీతో గెలుపు
రామగుండం నియోజకవర్గం ఏర్పడినప్పటినుంచి నాలుగు సార్లు ఎన్నికలు జరగగా...ఈ సారి జరిగిన ఎన్నికల్లోనే తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందారు. 2009లో పీఆర్‌పీ అభ్యర్థి కౌశిక హరిపై ఇండిపెండెంట్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ 2,220 ఓట్లతో, 2014లో ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై బీఆర్‌ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ 2,295 ఓట్లతో
2018లో జరిగిన ఎన్నికల్లో కోరుకంటి చందర్(ఏఐఎఫ్‌బీ).. అభ్యర్థి సత్యనారాయణ(బీఆర్ఎస్)పై 26,419 మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎంఎస్ రాజ్‌ఠాకూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై 56,794 ఓట్ల అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఈ మెజార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో అత్యధికం. రాజ్‌ఠాకూర్ మినహా మరే ఇతర అభ్యర్థికి 40 వేల మెజార్టీ దాటలేదు.