రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. పోలింగ్‌కు చాలా టైం ఉండడంతో స్లో అండ్ స్టడీ అన్న ధోరణిలో అన్ని పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీక్యాండిడేట్లు ఫైనల్అయినప్పటికీ.. ఆ పార్టీలు ప్రచారంలో మాత్రం స్పీడ్ పెంచడం లేదు. అధికార కాంగ్రెస్‌పార్టీకి సంబంధించి మరో ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఫైనల్కాలేదు.
ఒకటి, రెండు రోజుల్లో వారి లిస్ట్ కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. అయితే, బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు చేరికల మీద దృష్టి పెట్టగా.. తమ పార్టీ లీడర్లను, క్యాడర్‌ను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ నిమగ్నమైంది.
చేరికలపైనే కాంగ్రెస్ ఫోకస్
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేరికలపైనే ఫోకస్ పెట్టింది. అలాగే, ఏప్రిల్ మొదటి వారంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో తెలుగులో మేనిఫెస్టో రిలీజ్ చేయించే సభను తుక్కుగూడలో ఏర్పాటు చేస్తోంది. ఆ తరువాత రేవంత్ రెడ్డి వరుస ఎన్నికల ప్రచార సభలను ప్లాన్ చేసుకున్నారు. ప్రతి పార్లమెంట్నియోజకవర్గంలో కనీసం రెండు, మూడు సభలు పెట్టాలని చూస్తున్నారు.
ALSO READ :- ఎవర్ని వదలలేదు : ఫోన్ ట్యాపింగ్ లో రియల్ ఎస్టెట్ జ్యువెలరీ వ్యాపారులు
రాహుల్, ప్రియాంక గాంధీతోనూ సభలు, ర్యాలీలకు ప్లాన్ చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలతో పాటు 'పాంచ్ న్యాయ్'ను జనాల్లోకి తీసుకెళ్లడం ద్వారా 14 సీట్లు గెలవాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి రోజూ తన నివాసంలో లీడర్లతో భేటీ అవుతున్నారు. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సూచనలు చేస్తున్నారు. అన్ని పార్లమెంట్‌స్థానాల్లో మల్కాజ్ గిరి మాదిరిగా మూడంచెల వ్యూహం అమలు చేయాలని చూస్తున్నారు.