వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం : గౌరవ్ గొగొయ్

వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం : గౌరవ్ గొగొయ్

వక్ఫ్ సవరణ  బిల్లును లోక్ సభలో కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. లోక్ సభలో చర్చ సందర్భంగా .. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ . జేపీసీలో వక్ఫ్  బిల్లుపై సమగ్ర చర్చ జరగలేదన్నారు. 

సమగ్ర చర్చలు జరిగినట్టు ప్రభుత్వం చెప్పడం అబద్ధమన్నారు. ఐదు సమావేశాల్లోనూ బిల్లుపై చర్చ జరగలేదన్నారు గొగోయ్. భారత్ విభిన్న సంస్కృతులకు నిలయమని చెప్పారు. వక్ఫ్ బిల్లుతో సమస్యలు పెరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కొన్ని నియమాలను సృష్టించుకునే అధికారం వక్ఫ్ బోర్డుకు ఉందన్నారు. దానిని తొలగించాలని చూస్తుననారని ఆరోపించారు గొగొయ్.

దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన వక్ఫ్​ బిల్లు బుధవారం (ఏప్రిల్ 2) లోక్​సభ ముందుకు వచ్చింది. క్వశ్చన్ ​అవర్​ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు బిల్లును సభలో మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్​ రిజిజు ప్రవేశపెట్టారు. 

వక్ఫ్​ బిల్లును ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యతిరేకిస్తున్నది. లోక్​సభలో బిల్లు ఆమోదం పొందాలంటే 272 మంది సభ్యుల సాధారణ మెజార్టీ అవసరం. బీజేపీకి సొంతగా 240 మంది సభ్యులు ఉన్నారు. దాని మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ వంటి పలు పార్టీల బలంతో కలిపి 293గా ఉంది. సభకు తప్పకుండా హాజరుకావాలని, ఓటింగ్లో పాల్గొనాలని పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది.