హైదరాబాద్: జీహెచ్ ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు జీహెచ్ ఎంసీ ఆఫీస్ ను ముట్టిడించారు. వరద బాధితులకు పరిహారిం రూ. 10వేలు చెల్లించాలని కాంగ్రెస్ కార్యకర్తలు జీహెచ్ ఎంసీ ఆఫీసులోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. కార్పొరేటర్ విజయారెడ్డితో సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్ఢు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఇటు, భారీ వరదల కారణంగా చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో పలువురు గల్లంతు కాగా, కొంతమంది మృత్యువాతపడ్డారు. మరోవైపు హైదరాబాద్‌లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు జీహెచ్ ఎంసీని ముట్టడించాయి. వరద బాధితులకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.