కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన జూబ్లీహిల్స్​ ప్యాలెస్..​ లేదంటే కమాండ్​ కంట్రోల్​ సెంటర్

కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన జూబ్లీహిల్స్​ ప్యాలెస్..​ లేదంటే కమాండ్​ కంట్రోల్​ సెంటర్
  • అక్కడి నుంచే కాంగ్రెస్​ మార్క్​ ప్రజాపాలన: హరీశ్​ రావు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన జూబ్లీహిల్స్ ​ప్యాలెస్ ​నుంచి లేదంటే కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ నుంచి కొనసాగుతున్నదని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. పోలీ స్​ పహారా మధ్య గ్రామ సభలు, పోలీస్​ కమాండ్​ కం ట్రోల్​ సెంటర్​లో ప్రభుత్వ నిర్ణయాలు జరుగుతున్నాయని బుధవారం ఆయన ఓ ట్వీట్​లో విమర్శించారు.

‘‘ప్రజాపాలన అంటివి.. సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజాదర్బార్ అంటివి.. ప్రతిరోజూ ప్రజలను కలుస్త అంటివి.. ఏడాది కాలంగా మొఖం చాటేస్తివి.. సీఎం, మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా సువిశాలమైన సచివాలయం ఉన్నా.. దానిని కాదని మంత్రులు, అధికారులను నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్​కు, కమాండ్ కంట్రోల్ సెంటర్​కు పరుగులు పెట్టిస్తున్నవు ’’ అని పేర్కొన్నారు.