
భూపాలపల్లి రూరల్/ రేగొండ/ శాయంపేట/ నర్సంపేట, వెలుగు: ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీ రేషన్ షాప్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్ రెడ్డితో కలిసి సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాగా, ఎమ్మెల్యే గండ్ర రేగొండ, శాయంపేట మండల కేంద్రాల్లో సన్నబియ్యం పంపిణీ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలెక్టర్ సత్యశారదతో కలిసి సన్నబియ్యం పంపిణీ చేశారు.