సిద్దిపేట టౌన్, వెలుగు: రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేదల నిరీక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరదించిందని 37వ వార్డు కౌన్సిలర్ సాకీబాలలక్ష్మీ ఆనంద్ అన్నారు. గురువారం ఆమె ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే పేదల కోసం కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించిందన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఇప్పటికే రైతు రుణమాఫీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిందని, జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేయనుందన్నారు. కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ రియాజుద్దీన్, కాంగ్రెస్ శ్రేణులు నర్సింలు, శ్రీనివాస్, మల్లేశం, రఘు, యాదగిరి, అశోక్, నటరాజ్, నవీన్, పరశురామ్, రాజు పాల్గొన్నారు.