టెట్ దరఖాస్తు గడువు మరో 10 రోజులు పొడిగింపు

 టెట్ దరఖాస్తు గడువు మరో 10 రోజులు పొడిగింపు

టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు గడువును ప్రభుత్వం  మరోసారి పొడిగించింది.  షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10వ తేదీతో గడువు ముగుస్తు్ండటంతో మరో పది రోజులు అంటే ఏప్రిల్ 20 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  అంతేకాకుండా  ఏప్రిల్ 11 నుంచి 20 వరకు ఎడిట్ ఆప్షన్ కూడా కలిపించింది.  . ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఈ సందర్భంగా కోరింది.  

కాగా  మంగళవారం సాయంత్రం నాటికి మొత్తం 1,93,135 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1కు 72,771 దరఖాస్తులు రాగా..పేపర్ 2కు 1,20,364 వచ్చాయి. 2016లో నిర్వహించిన టెట్ కు 3.40 లక్షల దరఖాస్తులు రాగా, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు, 2023లో  2.83 దరఖాస్తులు వచ్చాయి.  టెట్‌ పరీక్ష మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలను జూన్‌ 12న వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ రాసేందుకు వీలు ఉంటుంది.  
 

  • Beta
Beta feature
  • Beta
Beta feature