కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసింది : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసిందన్నారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  ఇప్పటివరకు1200 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు.   కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్లు  కరెంటు ఫ్రీ గా ఇస్తుందని తెలిపారు.  మహిళలకు త్వరలోనే రూ.2500 రూపాయలు అందిస్తామని తెలిపారు. ఆగస్టు 15 వరకు రూ. 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామన్నారు.  చెన్నూర్ మండలం దుగ్నెపల్లి గ్రామంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు వివేక్. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..  దుగ్నేపల్లి గ్రామానికి 2 బోర్లు శాంక్షన్ చేసి నీటి ఎద్దడి లేకుండా చూస్తున్నానని ఎమ్మెల్యే వివేక్ హామీ ఇచ్చారు.  కౌలు రైతులకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.  ఎస్సీ కాలనీలో రోడ్డుకు ఎలక్షన్ కోడ్ అవగానే రూ.5 లక్షలు మంజూరు చేసి రోడ్డు వేపిస్తానని తెలిపారు.  పెద్దపల్లి  కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి  గడ్డం వంశీ కృష్ణ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వివేక్ కోరారు.  
 

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

రామగుండం సింగరేణి ఏరియా ఆర్జీ1, అర్జీ2, ఆర్జీ 3 పరిధిలోని 150మంది లోడింగ్ అన్ లోడింగ్ కార్మికులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు  రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహించిందని  రాజ్ ఠాకూర్ విమర్శించారు.   కార్మికులకు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అందిస్తుందన్నారు.  లోడింగ్ ఆన్ లోడింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా కృషి చేస్తానని రాజ్ ఠాకూర్ తెలిపారు.