
- కాంగ్రెస్ప్రభుత్వం పక్కా ప్లానింగ్‌తో ప్రాజెక్ట్ పూర్తిపై దృష్టి
- 3.23లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేలా పనులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : నేడు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ఓపెనింగ్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లావాసుల దశాబ్దాల కల నెరవేరనుంది. దాదాపు ఎనిమిదేండ్లుగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన గోదావరి జలాలు సీతారామ ద్వారా ఉమ్మడి జిల్లాలో నేడు పారనున్నాయి. పక్కా ప్రణాళికతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇరిగేషన్మినిస్టర్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాయంతో అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పనులు చకచక చేయించారు. ఫలితంగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ఎత్తిపోతల పథకాన్ని
ప్రారంభించనున్నారు.
పక్కా ప్లాన్‌తో..
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ సీతారామ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం, లోటు పాట్లపై ఇరిగేషన్ ఆఫీసర్లతో జిల్లా మంత్రులు చర్చించారు. తక్కువ ఖర్చుతో సీతారామ ద్వారా నీళ్లిచ్చే ప్రక్రియపై కసరత్తు చేశారు. అశ్వాపురం మండలంలోని జీ కొత్తూరు, ముల్కలపల్లి మండలంలోని పూసుగూడెం, కమలాపురం పంప్ హౌస్‌ల్లో దాదాపు మూడున్నరేండ్లుగా పడావు పడి ఉన్న మోటార్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేశారు. కేవలం రూ. 90కోట్లు ఖర్చు పెట్టి ఏన్కూర్ నుంచి ఎన్ఎస్పీ కెనాల్‌కు కేవలం ఎనిమిది కిలోమీటర్లు తవ్వి లింక్ చేయడం వల్ల ఎన్ఎస్పీ ఆయకట్టు కింద 1.20లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చనే నిర్థారణకు వచ్చారు.
అవసరమైన ఫండ్స్ కోసం ఇరిగేషన్ మినిస్టర్, మంత్రులు సీఎంతో చర్చించారు. సీంఎ అంగీకరించడంతో మోటార్లను ట్రయల్‌రన్ చేసేందుకు చైనా నుంచి ఇంజినీర్లను రప్పించారు. జీ కొత్తూరులోని మొదటి పంప్ హౌస్‌లో ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. అదే స్ఫూర్తితో 4 రోజుల కింద పూసుగూడెంలోని రెండో పంప్ హౌస్, బుధవారం కమలాపురంలోని మూడో పంప్ హౌస్ ట్రయల్ రన్ సక్సెస్ చేశారు.
ఫైనల్‌గా సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. కాగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా గురువారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పూసుగూడెంలోని రెండో పంప్ హౌస్‌లో సీతారామ ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇదే టైంలో బీజీ కొత్తూరులో కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కమలాపురంలలోని పంప్ హౌస్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు.
3.23 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు
సాగర్ నుంచి నీళ్లు రాకపోయినా సీతారామతో గోదావరి నీళ్లను పారించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. వచ్చే రెండేండ్లలో పాలేరు, సత్తుపల్లి ట్రంక్ కేనాల్ పనులు పూర్తి చేయడం, డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్‌కు అవసరమైన భూ సేకరణ, ఇతరత్రా పనులకు దశల వారీగా టెండర్లను పిలవాలని ఇప్పటికే సీఎం మంత్రులతో పాటు ఇరిగేషన్ ఆఫీసర్లను ఆదేశించారు.
2026 ఆగస్టు 15 నాటికి సీతారామను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 6.75లక్షల ఎకరాల నుంచి 7.81లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ప్రకటించారు. సీతారామ పూర్తి అయితే 3.23లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టుకు సాగు నీళ్లు అందుతాయని స్పష్టం చేశారు.