
వేములవాడ, వెలుగు : ఉపాధి హామీ పథకం ప్రారంభించిందే కాంగ్రెస్ ప్రభుత్వమని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని, 3500 మంది ఉపాధి హామీ కూలీలకు 100 రోజుల పని కల్పిస్తామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు తదితరులు పాల్గొన్నారు.
జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ పాదయాత్ర..
వేములవాడ పట్టణంలో శుక్రవారం జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ పాదయాత్రలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించిన కుల గణనను పూర్తిచేసి దేశంలో ఒక రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.