రియల్టర్‍, కన్‍స్ట్రక్షన్‍లకు స్వేచ్ఛ వాతావరణం : మంత్రి పొన్నం ప్రభాకర్‍

వరంగల్‍, వెలుగు: కాంగ్రెస్‍ ప్రభుత్వం రియల్టర్‍, కన్‍స్ట్రక్షన్‍లకు స్వేచ్ఛయుత వాతావరణం కల్పించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‍ అన్నారు. శనివారం హనుమకొండ వడ్డెపల్లిలోని పీజీఆర్‍ గార్డెన్‍లో ఏర్పాటు చేసిన రెండు రోజుల క్రెడాయ్‍ ప్రాపర్టీ షో 3వ ఎడిషన్‍ను మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా హాజరై స్థానిక వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్‍ బండ ప్రకాశ్‍, మేయర్‍ గుండు సుధారాణి, కుడా చైర్మన్‍ ఇనగాల వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఢిల్లీలో 1999లో ప్రారంభమైన క్రెడాయ్‍ దేశవ్యాప్తంగా ఎదగడం గొప్ప పరిణామమన్నారు. కార్యక్రమంలో క్రెడయ్‍ సంస్థ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు రవీందర్‍రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్‍సాగర్‍ రెడ్డి, రాష్ట్ర చైర్మన్‍ మురళీకృష్ణారెడ్డి, నేషనల్‍ ఈసీ మెంబర్‍ రామచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యాక్షులు అమరేందర్‍రెడ్డి, అమర్‍ లింగేశ్వర్‍తోపాటు రవీందర్‍రెడ్డి, మనోహర్‍, రజినికాంత్‍ రెడ్డి పాల్గొన్నారు.