కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది: మంత్రి పొన్నం ప్రభాకర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది: మంత్రి పొన్నం ప్రభాకర్‌

గండిపేట, వెలుగు: నార్సింగి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా కోట వేణుకుమార్, వైస్‌ చైర్మన్‌గా క్యాతం దశరథ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్‌, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్​గౌడ్‌ హాజరయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్​ మాట్లాడుతూ.. చిత్తశుద్ధితో పనిచేస్తూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. జీర్ణించుకోలేని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజాఠాగూర్, ముదిరాజ్‌ కార్పొరేషన్‌ సొసైటీ చైర్మన్‌ జ్ఞానేశ్వర్‌ముదిరాజ్, టీపీసీసీ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ మధుసుధన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత అశోక్‌యాదవ్ పాల్గొన్నారు.