ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ అని చెప్పారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి.
పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించినట్టే ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ను ఓడించాలన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే...పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు ఎమ్మెల్యేలు వివేక్, వినోద్.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యేలు వివేక్, వినోద్. స్థానికులను, చిరు వ్యాపారులను కలిసి, వారి సమస్యలు తెలుసుకున్నారు. కాంటా చౌరస్తాలో నిత్య జనగణమన కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత స్థానికంగా పని చేసే...కూలీలకు అల్పాహారం అందించారు నేతలు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ టౌన్ లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ తరుపున ప్రచారం చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. గడపగడపకు వెళ్లి సోనియాగాంధీ ప్రవేశ పెట్టిన ఐదు న్యాయ గ్యారంటీల గురించి ఓటర్లకు వివరించారు. గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా నిలిచి భారీ మెజారిటీతో గెలుపించాలని ఓటర్లను కోరారు విజయరమణారావు.